షేమ్.. షేమ్... యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు... (Video)

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (12:28 IST)
కోటానుకోట్ల భారతీయులు తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. యూరీలోని భారత ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపితే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది భారతీయులు దాడి చేశారు. ఈ దాడి తర్వాత భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో జాతియావత్తూ సిగ్గుపడాల్సిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో పాల్గొన్న వారిలో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసినట్టు 'సమాచార్ ప్లస్' వార్తా చానల్, వీడియోతో సహా వార్తలను ప్రసారం చేసింది. 
 
యూరీలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కోసం ఏర్పాటుచేసిన ర్యాలీలో పాకిస్థాన్ మద్దతు నినాదాలు వినిపించాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే నినాదాలు చేస్తున్న వారిని ఎవరూ వారించకపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

 

వెబ్దునియా పై చదవండి