గత కొంతకాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. గత యేడాది నవంబరు 26వ తేదీన వీరిద్దరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. నిశ్చితార్థం తర్వాత ఈ జంట పలుమార్లు కలిసి విహార యాత్రలకు కూడా వెళ్ళి వచ్చారు. తాజాగా వీరి వివాహం తేదీ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.