బీహార్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు వరదలై పారుతున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కుప్పకూలిపోతున్నాయి. చెరువు కట్టలకు గండ్లు పడుతున్నాయి.
తాజాగా ఓ ప్రాంత వాసులు వంతెనపై నిలబడి వరద నీటి ప్రవాహాన్ని చూస్తుండగా ఆ వంతెన ఒక్కసారి కుప్పకూలిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలతో పాటు ఓ మహిళ నీటిలో కొట్టుకునిపోయింది. వారు వరద నీటిలో కొట్టుకునిపోతున్నా.. ఆ గ్రామస్తులంతా చూస్తుండిపోయారు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.