స్మృతి ఇరానీకి స్థానచలనం.. సుబ్రమణ్య స్వామికి హెచ్ఆర్‌డి మంత్రిత్వ శాఖ?

శుక్రవారం, 17 జూన్ 2016 (09:17 IST)
పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్థానచలనం తప్పే సూచనలు కనిపిస్తున్నాయి. మానవవనరుల మంత్రిత్వ శాఖ నుంచి ఆమెను తొలగించి, ఆ స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అదేసమయంలో స్మృతి ఇరానీకి కేంద్ర సమాచార, ప్రసార శాఖను అప్పగించే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న స్మృతిని తప్పించాల్సిందిగా అమిత్ షా కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సూచన చేసినట్టు సమాచారం. అదేసమయంలో ఇటీవల రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికైన సుబ్రమణ్యస్వామికి మంత్రి పదవి లభించడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి