ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా పోటీ చేయకుండా రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమించాలని భావిస్తున్నారు. అదేసమయంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నియోజకవర్గం నుంచి ఇకపై కుమార్తె ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు. 2019లో ప్రియాంకా రాజకీయ అరంగేట్రానికి పూర్వరంగం సిద్ధమైందని, ఇకపై యూపీ కాంగ్రెస్ వ్యవహారాలన్నింటినీ ప్రియాంకే పర్యవేక్షిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియాగాంధీ రాజకీయ సన్యాసం చేస్తారని, పార్టీ బాధ్యతలను రాహుల్, ప్రియాంకలకు అప్పగించాలనుకున్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. నిజానికి యూపీ సీఎం అభ్యర్ధిగా ప్రియాంకాగాంధీనే ప్రకటించాలని తొలుత భావించినా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ సర్వేలు తేల్చడంతో విరమించుకున్నారు.