డిజిస్పైస్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, స్పైస్ మనీకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సోనూ సూద్ వ్యవహరించనున్నారు. డీల్‌లో భాగంగా సోనూ సూద్‌కు చెందిన సూద్ ఇన్పోమేటిక్స్ (సీఐఎల్) సంస్థకు స్పైస్ మనీలో 5 శాతం వాటాను కేటాయిస్తారు.
సోనూ సూద్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గా నియమిస్తారు. కరోనా కల్లోలం చెలరేగినప్పు డు, లాక్‌డౌన్ కాలంలో ఆపన్నులకు అండగా నిలిచిన సోనూ సూద్ కార్యక్రమాల్లో కొన్నింటిని కొనసాగిస్తామని స్పైస్ మనీ తెలిపింది.
కోటి మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలను డిజిటల్‌గా, ఆర్ధికంగా శక్తివంతం చేసే లక్ష్యంతో ఉన్నామని స్పైస్ మనీఫౌండర్ దిలీప్ మోడీ వెల్లడించారు. ఇదే లక్ష్యంతో భాగస్వామిగా సోను సూద్‌లో ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు.
గ్రామీణులు తమ ఇళ్లను, కుటుంబాలను విడిచిపెట్టకుండా స్వతంత్ర జీవనోపాధిని సంపాదించేందుకు అవసరమైన సాంకేతిక శక్తిని అందిస్తామని భారత్ ప్రతి మూలలో స్వావలంబన, వ్యవస్థాపకత, ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సహించనున్నామని తెలిపారు.