రూ.100, రూ.10, రూ. 5 నోట్లను మార్చి లేదా ఏప్రిల్ నాటికి నిలిపివేయాలని ఆర్‌బిఐ యోచిస్తున్నట్లు సమాచారం. రూ.100, రూ.10, రూ.5 పాత నోట్ల ముద్రణను ఆపేయబోతున్నట్లు ఆర్‌బిఐ అధికారులు వెల్లడించారు.
ముద్రణే కాదు... ప్రస్తుతం చెలామణీలో ఉన్న పాత సిరీస్ నోట్లు కూడా మార్చి, ఏప్రిల్‌లో చెలామణిలో లేకుండా చేస్తామని తెలిపారు. రూ. 10 నాణేలను ప్రవేశపెట్టి 15 సంవత్సరాలవుతున్న కూడా వ్యాపారులు, వాణిజ్యదారులు వాటిని విశ్వసించలేకపోతున్నారని, ఇది బ్యాంకులకు, ఆర్‌బిఐకి సమస్యగా మారిందన్నారు.