సహనంపై మాటెత్తితే దేశ ద్రోహిగా ముద్రవేయడం సరికాదు: రాహుల్ గాంధీ

మంగళవారం, 24 నవంబరు 2015 (18:40 IST)
దేశంలో అసహనం పెరిగిపోతోందని ఎవరైనా అంటే వెంటనే ఆ వ్యక్తిపై విమర్శలు గుప్పించడం..  దేశ ద్రోహిగా ముద్ర వేయడం సరికాదని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

ఎవరైనా దేశంలో అసహనం ఉందని చెబితే అందుకు కారణాలు ఏంటని ఆరాతీయాలని, అవసరమైతే అతని అసహనాన్ని పారద్రోలే ప్రయత్నం చేయాలే తప్ప.. అతనిపై విరుచుకుపడి.. విమర్శలు చేయడం ద్వారా గొప్ప సహనం ఉందని నిరూపించుకోకూడదని రాహుల్ గాంధీ అన్నారు. 
 
భారత దేశంలో సమస్యలకు పరిష్కారం చూపడమే మార్గం తప్ప, ఆ సమస్యను సూచించిన వారిని విమర్శించడం, ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్రవేయడం.. వేధించి, బెదిరించి, అగౌరవపరిచి సహనాన్ని నిరూపించుకోకూడదని హితవు పలికారు. ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీ పలు సూచనలు చేశారు.

సహనంపై మాటెత్తిన వ్యక్తిపై ఎదురు దాడికి దిగడం సరికాదని.. అతనిని కేంద్ర సర్కారుకు, మోడీకి వ్యతిరేకమైన వ్యక్తిగా ముద్ర వేయడం సబబు కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి