కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ డ్రగ్స్ తీసుకుంటారనీ, అందువల్ల ఆయనకు తొలుత డ్రగ్ పరీక్ష నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు.
పంజాబ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డోపింగ్ పరీక్షులు నిర్వహించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ, పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందు రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారు కాబట్టి... డోప్ టెస్టులో కచ్చితంగా ఆయన విఫలమవుతారని చెప్పారు.
మరోపక్క, పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ స్పందిస్తూ, పంజాబ్‌లో డ్రగ్స్ తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారని... ఆ పార్టీలోనే ఎక్కువ మంది మత్తుమందు బానిసలు ఉన్నారని, ముందు వారికి డోపింగ్ టెస్టులు నిర్వహించాలని ఎద్దేవా చేశారు.