చెన్నై, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు.. తమ విలువైన ఓట్లను అంగట్లో సరకుల్లా అమ్ముకున్నారని.. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆర్‌కే నగర్ ఓటర్లు రూ.20 టోకెన్లకు అమ్ముడు పోయారని, ఇది భిక్షమెత్తడం వంటిదేనని, ఇంతటి నీచమైన సంఘటన మరెక్కడైనా చూడగలమా అంటూ విరుచుకుపడ్డారు.
మలేషియాలో జరుగుతున్న నడిగర్ సంఘం స్టార్ నైట్ కార్యక్రమానికి వెళ్తూ వెళ్తూ చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్.. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో డబ్బు ప్రభావంతోనే దినకరన్ గెలిచారనే విమర్శలకు తాను కట్టుబడి వున్నానని తెలిపారు.