భారత జాలర్ల హత్య కేసు.. ఇటలీ నావికుల్లో ఒకరికి బెయిల్ నిబంధనల సడలింపు.. ఇంటికెళ్ళొచ్చు..!

గురువారం, 26 మే 2016 (16:29 IST)
2012లో ఇటలీకి చెందిన ఇద్దరు నావికులు కేరళ తీరంలో ఇద్దరు భారత మత్స్యకారులను సముద్ర దొంగలుగా భావించ కాల్చి చంపేసిన ఘటనలో కేంద్ర ప్రభుత్వం ఆ నావికులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. ఈ నేఫథ్యంలో ఇద్దరు భారతీయ జాలర్ల హత్య కేసులో విచారణ ఎదుర్కుంటున్న ఇటాలియన్ నావికుల్లో ఒకరైన సాల్వటోర్ గిరోన్‌కు ఇంటికెళ్లేందుకు అనుమతి లభించింది. 
 
ఇటీవల ఐక్యరాజ్య సమితికి చెందిన  పర్మనెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ కూడా గిరోన్‌కు బెయిల్‌ నిబంధనలు సడలించాలని ఆదేశించిన తరుణంలో బెయిల్ నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని గిరోన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు నిబంధనలను సడలించింది. ఇంకా గిరోన్‌ను ఇంటికెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. 
 
కేంద్ర ప్రభుత్వం కూడా మానవతాదృక్పథంతో గిరోన్‌కు మద్దతు తెలిపింది. కాగా ఇద్దరు నావికులు చమురు ట్యాంకర్‌కు కాపలా కాస్తున్నారని.. జాలర్లను దొంగలుగా భావించి పొరపాటున కాల్చి చంపినట్లు ఇటలీ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి