రక్తదానం. ఒక్కరు రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడుకోవచ్చు. చాలామంది రక్తదానం అనగానే భయపడుతుంటారు. రక్తదానం చేయడం వల్ల దానం చేసినవారికి పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అదేసమయంలో ఆపదలో వున్నవారి ప్రాణాలను కాపాడినవారవుతారు. రక్తదానం చేసినవారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
గుండెకి సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది, శరీరంలో కేలరీలు ఖర్చవుతాయి.