ఫోనులో, వాట్సప్, ఫేస్ బుక్‌ల ద్వారా తలాక్ చెప్పేయడం ద్వారా భార్యను వదిలించుకునే భర్తలపై ముస్లిం మహిళలు తిరగబడుతున్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ బెంచ్ మే 11వ తేదీ నుంచి వాదనలను విననుంది. ట్రిపుల్ తలాక్‌పై వాదనలు మే 11 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలతో భర్తలు తెగతెంపులు చేసుకోవడం అనైతికమన్నారు. ఈ పద్ధతి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పురుషులు మూడుసార్లు తలాఖ్ చెప్పేసి భార్యలను వదిలించుకోవడాన్ని అనుమతించడం సరికాదని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.