సాధారణంగా వజ్రపు ఉంగరంలో ఒకటి లేదా రెండు, అలాకాకుంటే గరిష్టంగా తొమ్మిది వజ్రాలను అమర్చుతారు. కానీ, ఇక్కడు ఒకే రింగులో ఏకంగా 6,690 వజ్రాలను (డైమండ్స్)ను అమర్చారు. వీటన్నింటినీ 18 క్యారెట్ల ఉంగరంలో అమర్చారు.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నగలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్‌లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్‌తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు.
నీటి రక్షణ, పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ఉంగరాన్ని తామర పువ్వు ఆకృతిలో తయారు చేసినట్టు చెప్పారు. ఈ లోటస్ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.