ఇది ఆధార్ కార్డును జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) హెల్ప్‌లైన్ నంబర్ అని తేలింది. ఇప్పుడీ కొత్త నంబర్ ఆటోమెటిగ్గా యూజర్ల కాంటాక్ట్ లిస్ట్‌లోకి చేరిపోవడంతో కొందరు బేజారైపోవడం కనిపించింది. ఓ యూజర్ అయితే భయపడిపోయి ట్వీట్ కూడా చేసేశాడు. తన ఫోన్‌కి గుర్తు తెలియని ఓ నెంబర్ వచ్చి చేరిందనీ, దాన్ని మొబైల్ స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశాడు.
కాగా అసలు తాము ఏ సర్వీస్ ప్రొవైడర్ లేదా మొబైల్ తయారీ సంస్థలను 1947 నెంబరును జోడించాలని కోరలేదని యూఐడీఏఐ వివరణ ఇవ్వడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. మరోవైపు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తన ఆధార్ నంబర్‌ను బయటపెట్టగా ఆయన వివరాలు పూర్తిగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త 1947 నెంబరు ఫోన్లలోకి చొరబడటంతో ఆందోళన కలుగుతోంది. మరి జాగ్రత్త సుమీ.