తౌక్టే తుపాను బీభ‌త్సం... క‌ర్ణాట‌క‌లో న‌లుగురి మృతి...

ఆదివారం, 16 మే 2021 (14:12 IST)
తౌక్టే తుపాను సృష్టిస్తోన్న బీభ‌త్సానికి క‌ర్ణాట‌క‌లో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. క‌ర్ణాట‌క‌లోని తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని అక్క‌డి అధికారులు ప్ర‌క‌టించారు. 
 
అంతేగాక‌, 'తౌక్టే' అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి యెడియూరప్ప ప‌లు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్లతో స‌మావేశం నిర్వ‌హించి, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తున్నారు. కాగా, ఈ నెల 18న ఉదయం గుజరాత్‌ వద్ద తుపాను తీరం దాటుతుందని ఇప్ప‌టికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్ర‌క‌టించింది. 

ప్రస్తుతం పంజిమ్‌ - గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్ల దూరం, ముంబైకి 520 కిలోమీటర్ల దూరంలో అది ఉందని అధికారులు చెప్పారు. గోవా తీర ప్రాంతాలపై కూడా తుపాను ప్ర‌భావం క‌న‌ప‌డుతోంది. వాతావ‌ర‌ణ శాఖ ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే  సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు