వివాహేతర సంబంధం సాగిస్తున్న భార్య గుట్టుని టెక్నాలజీ సాయంతో ఓ భర్త బట్టబయలు చేశాడు. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య మరొకరితో చాలా కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ టెక్కీ చాలా తెలివిగా ఆమె అక్రమ సంబంధం గుట్టును రట్టు చేసి విడాకులు పొందాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల యువకుడు భార్య, మూడేళ్ల కూతురితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు.
గత ఏడాది ఫిబ్రవరిలో అతనికి మెదటిసారి భార్యపై అనుమానం కలిగింది. తన ఇంట్లో సిగరెట్ ముక్కలు ఉండడం గమనించి విస్తుపోయాడు. ఇంట్లో సిగరెట్ తాగేవాళ్లు ఎవ్వరూ లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆ భర్త ఈ విషయమై భార్యను నిలదీస్తే తనకేం తెలియదని బుకాయించింది. భార్య ప్రవర్తనపై అనుమానం ఎక్కువవ్వడంతో ఆమెపై కన్నేసి ఉంచాడు. ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆధునాతన అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్‌ను తన లాప్ టాప్కు అనుసంధానం చేశాడు. అయితే భర్తకు అనుమానం రావడంతో భార్య కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నట్లు నటించింది.
వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. జూలైలో ఆమె తన బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భనిరోదక మాత్రలు తెమ్మని చెప్పిన మాటలు టెక్కీకి తెలిసిపోయింది. భర్త అమర్చిన సీసీటీవీ కెమేరాలు బాత్ రూమ్‌లో, లివింగ్ రూమ్‌లో, బెడ్ రూమ్‌లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె సాగించిన రాసలీలలన్నీ రికార్డయ్యాయి. అంతే ఆ వీడియో ఫుటేజీలను చేతబట్టుకుని నేరుగా కోర్టుకు వెళ్లిన టెక్కీ తనకు విడాకులు కావాలని కోర్టుని కోరాడు. కోర్టు ఆ వీడియోలను వీక్షించి టెక్కీకి తన భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది. పాప సంరక్షణ బాధ్యతలు కూడా తండ్రికే అప్పగించింది.