ఏపీ తెలంగాణకు శకటాలకు అనుమతి: తమిళనాడుకు నో!

సోమవారం, 26 జనవరి 2015 (16:30 IST)
ఢిల్లీలో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి రాజ్ పథ్‌‌లో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన శకటాలకు అవకాశం కల్పించారు. దీంతో రెండు రాష్ట్రాలు కూడా సాంస్కృతిక వైభవాన్ని చాటేలా శకటాలను తయారు చేశారు.
 
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాల శకటాలు వరుసగా వస్తుండగా, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల శకటాల తర్వాత తెలంగాణ శకటాన్ని తీసుకొచ్చారు. ముందు పోతురాజు, వెనక బోనాలతో పాటు బోనాల పండుగ సందర్భంగా కనిపించే విశేషాలతో ఈ శకటం అందరికీ ఆసక్తి కలిగించింది.
 
శకటం మీద మహిళల సంప్రదాయ నృత్యాలు కూడా అలరించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా శకటాన్ని ప్రదర్శించే అవకాశం రావడంతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సంబరాల గురించి తెలిపేలా తమ శకటాన్ని రూపొందించింది.
 
రిపబ్లిక్ వేడుకల్లో మొత్తం 25 శకటాలను ప్రదర్శించారు. వీటిలో 16 శకటాలు మాత్రం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి కావడం విశేషం. ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఓడిషా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల శకటాలను అనుమతి లభించలేదు.

వెబ్దునియా పై చదవండి