కరోనా టెస్ట్ కిట్లు, పీపీఈలపై కేంద్రం దృష్టి

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (07:45 IST)
కరోనాపై పోరును మరింత ముమ్మరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. పరీక్ష కిట్లు, వైద్యుల కోసం వ్యక్తిగత సంరక్షణ కిట్ల లభ్యత పెంచడంపై దృష్టిపెట్టింది.

వైద్య సదుపాయాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కరోనా వైరస్​ను కట్టడి చేసేందకు దృష్టిసారించింది కేంద్రం. వ్యక్తిగత రక్షణ కిట్లు(పీపీఈ) అందుబాటుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

అయితే ప్రస్తుతం ఉన్నవాటిని సరైన రీతిలో ఉపయోగించాలని సూచించింది. త్వరలో మరిన్ని కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించింది. ఇప్పటివరకు 1,30,000 పరీక్షలు నిర్వహించామని.. పాజిటివ్​గా తేలుతున్న వారి శాతం 3-5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు