దొంగను పట్టుకుబోయిన వ్యక్తి రైలులో చిక్కుకుని దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, ముంబైకి చెందిన షకీల్ షేక్ (53). ఇతడు జోగేశ్వరి నుంచి చర్చ్ గేట్ వరకు జర్నీ చేసేందుకు రైలు ఎక్కాడు.
అతని పక్కన నిల్చున్న ఓ యువకుడు.. షకీల్ మొబైల్ ఫోన్‌ను లాక్కొని పారిపోయాడు. రైలు నుంచి దిగిపోయాడు. వెంటనే తేరుకున్న షకీల్, దొంగను పట్టుకునేందుకు రైలు నుంచి ఉన్నట్టుండి కిందకు దూకాడు. కానీ అదుపుతప్పి కిందపడిపోయాడు.