ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు ఆందోళనల్లో 5G, జియో, చైనా కనెక్షన్ ఇదే...

బుధవారం, 16 డిశెంబరు 2020 (13:22 IST)
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం పేరిట సాగుతున్న ఆందోళనలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా రైతు ఉద్యమం ముసుగులో కొందరు ఆందోళనకారులు కొత్త రంగులు చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యమంలో కొందరు ఆందోళన కారులు ఖలీస్తాన్ మరియు పాకిస్తాన్ అనుకూల విధానాలు అవలంబిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను రైతు సంస్థలు వ్యతిరేకించాయి.
 
ఇప్పుడు తాజాగా ఖలీస్తాన్, పాకిస్తాన్‌తో పాటు చైనీస్ ఏజెంట్లు కూడా ఈ ఉద్యమంలో ప్రవేశించినట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా కొందరు చైనీస్ ఏజెంట్లు ఈ ఉద్యమం ముసుగులో దూరి తమ రహస్య ఎజండా అమలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 
 
రైతు ఉద్యమంలో రిలయన్స్ JIO బహిష్కరణ నినాదాలు రావడానికి ఇది కూడా కారణం కావచ్చనే వాదన వినిపిస్తోంది. కానీ ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది? అన్నింటికంటే ముందు రిలయన్స్ JIOపై దుష్ప్రచారం చేయడం ద్వారా రైతుల మధ్య దాగి ఉన్న ఖలిస్తానీ ఏజెంట్లకు ఏమి ప్రయోజనం ఉంటుంది అనేది ఆలోచించాల్సిన విషయమే.
 
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో మొబైల్ మరియు ఇంటర్నెట్ వార్తలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఒకే పేరు వినిపిస్తోంది... అదే  హువావే(Huawei). నిజానికి హువావే ఒక చైనా ప్రభుత్వ సంస్థ. అది బ్రిటన్ మరియు భారతదేశంతో సహా అన్ని దేశాలలో 5G నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం కారణంగా చైనా ముప్పు నుంచి బయటపడేందుకు భారత్, బ్రిటన్ సహా పలు దేశాలు చైనా కంపెనీ హువావే(Huawei)కు ఇచ్చిన 5G టెక్నాలజీ ఒప్పందాలను రద్దు చేశాయి.
 
ఆ సమయంలోనే 5G లేకుండా ప్రపంచం అలాగే ఉంటుందా అనే ప్రశ్న అప్పుడు వచ్చింది. అటువంటి పరిస్థితిలో, సాంకేతికంగా అద్భుతమైన నాలెడ్జిని సొంతం చేసుకున్న భారతీయ ఇంజనీర్లు మరియు రిలయన్స్ JIO ప్రపంచంలోని రెండవ చౌకైన మరియు మెరుగైన 5G టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని పరీక్ష భారతదేశంలో ఒక నెల ముందుగానే జరిగింది. 
 
రిలయన్స్ ఈ దశలో 5G పరికరాలు, టవర్లు ఏర్పాటు చేసే ఒప్పందంలో గెలిస్తే చైనా వేల ట్రిలియన్ డాలర్లను కోల్పోయే అవకాశం ఉందని చైనా అంచనా వేసింది. మరోవైపు, భారతదేశంలోనే కాకుండా అమెరికాలో సైతం 5G టెక్నాలజీ ఆమోదం లభిస్తే రిలయన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 5G టెక్నాలజీ కాంట్రాక్టులు దక్కే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు చైనా కంటే భారతదేశాన్ని పెద్ద మొబైల్ టెక్నాలజీ హబ్‌గా మారే అవకాశం ఉంది. 
 
ఈ నేపథ్యంలో హువావేను కాపాడటానికి మాత్రమే, రిలయన్స్ జియోను భారతదేశంలో బలహీనపరిచే కుట్రలో భాగంగా రైతు ఉద్యమంలో ఖలిస్తానీ ఏజెంట్లు JIO బహిష్కరణ ఎజెండాను అనుసరిస్తున్నారని వర్గాలు వెల్లడించాయి.
 
ఇలా చేయడం ద్వారా, రిలయన్స్ JIO భారతదేశంలోనే సంస్థపై ప్రశ్నార్థకం చేయవచ్చు. రిలయన్స్ పైన అలాంటి దుష్ప్రచారం ద్వారా కొంతకాలం దృష్టి మరల్చడానికి ఉపయోగపడుతుంది. సోర్సెస్ ప్రకారం, టెలికాం వంటి సున్నితమైన కేసులలో, అంతర్జాతీయ ఏజెన్సీలు వివాదంలో చిక్కుకున్న సంస్థకు కాంట్రాక్టులు ఇవ్వడంలో దర్యాప్తు పేరిట ఆలస్యం చేస్తుంటాయి. ఆ కేసుల్లో భారతదేశంలో రిలయన్స్‌ను జత చేయాలని చైనా కోరుకుంటుంది. చైనా కంపెనీ తన సమావేశాలలో ఈ ఆరోపణలను సద్వినియోగం చేసుకోవచ్చు.
 
స్వదేశంలో రిలయన్స్‌ను ముట్టడి చేయడం ద్వారా, విదేశాలలో కొత్త ఒప్పందాలను దక్కించుకునేందుకు రైతు ఉద్యమంలో జియోను ఇరికించడానికి చైనా కుట్రలు చేస్తోంది. రైతుల ఉద్యమంలో రిలయన్స్ JIO సిమ్ బహిష్కరణ ఈ కోవకు చెందినదే. ఫేస్‌బుక్‌తో కలిసి రిలయన్స్ JIO పొలాల నుండి ప్రత్యక్షంగా పంటను కొనుగోలు చేసి నేరుగా మార్కెట్‌లోని వినియోగదారులకు విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో జియోపై ఈ స్థాయి కుట్రను గమనించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు