వ్యభిచార కేసుల్లో పట్టుబడే వారికి శిక్షలు విధించే న్యాయమూర్తులే వ్యభిచారం చేశారు. పైగా, పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ విషయం హైకోర్టుకు చేరడంతో విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో చేసిన తప్పును అంగీకరించిన న్యాయమూర్తులకు బీహార్ ప్రభుత్వం శిక్ష విధించింది. అంటే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది బిహార్ రాష్ట్రంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొన్నేళ్ళ క్రితం బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు జడ్జీలు నేపాల్‌కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో బసచేసిన వారు.. తమ గదులకు అమ్మాయిలను పిలిపించుకుని రాసలీలల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు హోటల్‌లో రైడ్ చేయడంతో వారు స్వయంగా పట్టుబడ్డారు.
ఇలా పట్టుబడిన జడ్జీల్లో బీహార్‌లోని సమస్తిపూర్‌లో గతంలో ప్రిన్సిపల్ జడ్జిగా పనిచేసిన హరి నివాస్ గుప్తా, మరో ఇద్దరు జడ్జీలు జితేంద్రనాథ్ సింగ్, కోమల్ రాంలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పాట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు ముగ్గురు జడ్జీలు తప్పు చేసినట్లు ధ్రువీకరించారు.