వరద నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న పులి... ఎక్కడ?

ఆదివారం, 24 జులై 2022 (09:29 IST)
ఓ పులి వరద నీటి ఉధృతిలో కొట్టుకుని పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ దృశ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజాపురి బ్యారేజీ వద్ద కనిపించింది. 
 
ఈ బ్యారేజీ నుంచి విడుదల చేసిన వరద నీటిలో చిక్కకున్న ఈ పులి వరద నీటి నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడింది. భారీ నీటి ప్రవాహాన్ని దాటేందుకు శతవిధాలా ప్రయత్నం చేసి, చివరకు గిరిజాపురి బ్యారేజీ వరద నీటిలో దిగువ ప్రాంతానికి కొట్టుకునిపోయింది. 
 
ఈ ప్రాంతం దుద్వా టైగర్ రిజర్వ్‌లో భాగమైన కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉంది. అది బ్యారేజీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది కానీ భారీ ప్రవాహాలు బ్యారేజీ కిందికి కొట్టుకునిపోయింది. 
 
అప్రమత్తమైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో అటవీశాఖ అధికారులు పులి సంచారాన్ని పరిశీలించి బ్యారేజీ గేట్లను మూసివేశారు. ఆరు గంటల శ్రమ తర్వాత పులి సురక్షితంగా రక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు