ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో రూ.4.5కోట్లు గుంజుకున్నాడు. ఈ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూర్‌లో పెళ్లి సంబంధాల ఏజెన్సీ నిర్వహించే మోహన్.. విడాకులు తీసుకున్నవారు.. వితంతువులను లక్ష్యంగా పెట్టుకుని ఎనిమిదేళ్లలో ఏకంగా ఎనిమిది మందిని పెళ్లాడాడు.