తమిళనాడుకు చెందిన 25 ఏళ్ళ యువతి కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని పరాప్పణ అగ్రహారంలోని పీజీ హాస్టల్లో మరో మహిళతో కలిసి పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. ఐటీ ఉద్యోగిని అయిన ఆమె అనారోగ్యంతో విధులకు హాజరుకాలేదు. ఈపరిస్థితుల్లో హాస్టల్లో దొంగతనం కోసం వచ్చిన ఓ చోరుడు... ఒంటరిగా ఉన్న ఆ యువతిని కత్తితో బెదిరించి రేప్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.