ఫ్యాషన్ పేరిట వస్త్రధారణ మోజు మహిళల్లో అధికమైంది. ఇంటికే పరిమితమైన మహిళలైనా, ఉద్యోగినులైనా తమను అందంగా చూపెట్టుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా ఓ మహిళ పెళ్లికి వెళ్తూ వెళ్తూ అందంగా ముస్తాబై హీల్స్ వేసుకుంది. అయితే హీల్స్ పుణ్యంతో కాలు జారిపడింది. అంతే కన్నబిడ్డను పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. థానేకు చెందిన ఫెహ్మిదా షేక్ అనే మహిళ తన భర్త, ఆరు నెలల బిడ్డతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైంది. పెళ్లికావడంతో అందంగా ముస్తాబైన ఫెహ్మిదా.. హై హీల్స్ ధరించింది. వివాహ వేడుక ముగిసిన తర్వాత ఫంక్షన్ హాలులో తొలి అంతస్తు వద్ద ఫెహ్మిదా వేసుకున్న హీల్స్ అదుపు తప్పడంతో ఆమె చేతిలోని బిడ్డ మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయాడు.