కాగా ఈ ఏడాది మొత్తం 140 మంది చలన చిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతులమీదుగా అందజేయాల్సి వుంటుంది. కానీ రాష్ట్రపతి గంట మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని.. 11 అవార్డులను మాత్రమే అందజేస్తారని.. మిగిలిన అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందిస్తారని రాష్ట్రపతి కార్యాలయం నిర్వాహకులకు తెలిపింది. దీనిపై విజేతలు చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు.