త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌పై హత్యాయత్నం.. ముగ్గురి అరెస్టు

శనివారం, 7 ఆగస్టు 2021 (13:40 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ దేవ్ ఉన్నారు. ఈయనపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఈ దాడి కేసులో త్రిపుర పోలీసులు ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. 
 
గురువారం సాయంత్రం అగ‌ర్తాలాలోని శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ లేన్‌లోని త‌న అధికారిక నివాసం వ‌ద్ద విప్ల‌వ్ కుమార్ ఈవినింగ్ వాక్ చేస్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు కారులో వ‌చ్చి సీఎంను ఢీకొట్టేందుకు య‌త్నించారు.
 
అప్ర‌మ‌త్త‌మైన సీఎం ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప‌క్క‌కు జంప్ చేశారు. సీఎం సెక్యూరిటీలో ఒక‌రికి స్వల్ప గాయాల‌య్యాయి. ఆ దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది య‌త్నించారు. 
 
అదే రోజు రాత్రి ఆ ముగ్గురిని కీర్చోముహ‌ని ఏరియాలో అదుపులోకి తీసుకుని వాహ‌నాన్ని సీజ్ చేశారు. ఈ ముగ్గురిని శుక్ర‌వారం రోజు కోర్టులో హాజ‌రుప‌రిచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు