ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా మోరీ బ్లాకులో చీవా ఉన్నత పాఠశాలలో లలిత్ కుమార్ అనే వ్యక్తి గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈయన ఉదయం సాంయత్రం వేళల్లో ఇంటివద్ద కొంతమంది విద్యార్థులకు ట్యూషన్లు కూడా చెపుతున్నాడు. అయితే, గురువారం రోజూలాగే విద్యార్థులు ట్యూషన్‌కు వచ్చారు.
వీరిలో 14 బాలికను మినహా మిగతావారందరినీ ఇళ్లకు పంపించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం జరిపాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర ఉపాధ్యాయుడు లలిత్ కుమార్‌ను అరెస్టు చేసి, బాధితురాలిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఉత్తరకాశీ పోలీసులు వెల్లడించారు.