స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను స్మగ్లింగ్ కోసం ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. స్మగ్లింగ్‌కు తన పురీషనాళాన్నే సాధనంగా చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం దుబాయ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ యువకుడి ప్రవర్తన అనుమానంగా ఉండటంతో.. కస్టమ్స్ అధికారులు అతన్ని రహస్యంగా తనిఖీ చేయించారు.
ఈ సందర్భంగా అతడి పాయువులో దాచేసిన బంగారు కడ్డీలను గుర్తించారు. ఆపై అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.1.5 కోట్ల విలువ చేసే.. 1.04 కిలోల బరువైన తొమ్మిది బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న చెన్నైకి చెందిన ఒక వ్యక్తిని, ఫ్రాన్స్ జాతీయుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల బంగారు కడ్డీ, 5 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నూజివీడులో ఇల్లు చూసేందుకు వచ్చిన రమేష్.. ఇంటి ఓనర్ సులోచన ఒంటిపై ఆభరణాలను దోచుకున్నాడు. తాను ఇవ్వనని బాధితురాలు ఎదురు తిరగడంతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఆభరణాలు దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. 24 గంటలు గడవక ముందే నిందితుడిని పట్టుకున్నారు.