తమిళనాడులో జయలలిత మరణం తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయి. ఎవరికి తోచినట్లు వారు గ్రూపులను ఏర్పాటు చేసుకుని పార్టీని, అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. శశికళ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోగా, పళని స్వామి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి పార్టీ తమదంటే తమదంటూ కోర్టుకు వెళ్లారు.
తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. అన్నాడీఎమ్‌కేకు చెందిన రెండాకుల గుర్తు, పార్టీ పేరు ముఖ్యమంత్రి పళని స్వామి వర్గానికే చెందుతుందని తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో శశికళ, టీటీవీ దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 నవంబర్‌లో ఎన్నికల కమీషన్ పార్టీ పేరును, గుర్తును పళని స్వామికే కేటాయించింది. అయితే పార్టీ తమదంటూ టీటీవీ దినకరన్ కోర్టుకు వెళ్లారు.