2022-23 బడ్జెట్ హైలైట్స్ - 2022 చివరి నాటికి 5జి స్ప్రెక్టమ్ వేలం
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (17:58 IST)
లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పేపర్ లేస్ విధానంలో ఈ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగో ఏడాది ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
2022-23 బడ్జెట్ హైలైట్స్
* 2023లో ద్రవ్యలోటు 6.4 గా ఉంటుందని అంచనా
* 2022 మూలధన వ్యయం 35.4 శాతానికి పెంపు
* రూ.7.50 లక్షల కోట్లు కేటాయింపు
* ప్రతి తరగతికి ఒక టీవీ ఛానెల్ ద్వారా పాఠాలు, ప్రాంతీయ భాషల్లో పాఠాలు, ప్రస్తుతం 12 విద్యా టీవీ ఛానెల్స్ ఉండగా.. వీటిని 200 కి పెంపు
* ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం
* రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ అమలు
* రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలకు అవకాశం
* డిఫెన్స్ బడ్జెట్‌లో 25 శాతం డిఫెన్స్ రీసెర్చ్ కోసం కేటాయింపులు
* పర్యాటక ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి పనులు
* ఎనిమిది పర్యాటక ప్రాంతాల్లో 60 కిమీ మేర రోప్‌వేలు
* సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం రూ.19500 కేటాయింపులు
* 10 రంగాల్లో క్లీన్ ఎనర్జీ యాక్షన్ ప్లాన్
* ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక పోర్టల్