గ్యాంగ్ రేప్ చేశారు.. ఆపై నాలుక కత్తిరించి చిత్ర హింసలు.. ఎక్కడ?

ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (13:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ యువతిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు. ఆ తర్వాత విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆ యువతి నాలుక కత్తిరించి, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచశారు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలోని పత్రాస్ ప్రాంతంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పత్రాస్ ప్రాంతానికి చెందిన 20 యేళ్ళ యువతి తన తల్లితో పాటు పొలం పనులకు వెళుతూ ఉండేది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు పట్టుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విషయాన్ని వరికీ చెప్పకూడదని ఆమె నాలుక కోసేశారు. ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. శరీరంపై గాయాలు చేశారు. ప్రస్తుతం ఆ యువతి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతోంది. 
 
పైగా, ఆ యువతి షెడ్యూల్‌ కులానికి చెందిన అమ్మాయని, నిందితులు అగ్రవర్ణ కులానికి చెందిన వారని, దీంతో మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. చివరకు యువతి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఆ నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఆలస్యంగా చర్యలు తీసుకోవడం పట్ల బాధితురాలి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
దీనిపై బాధితురాలి సోదరుడు స్పందిస్తూ, తన తల్లితో పాటు సోదరి పొలం పనులు చేయడానికి వెళ్లగా అత్యాచార ఘటన చోటుచేసుకుందని చెప్పాడు. తన చెల్లి ఒక్కతే పొలం పనులు చేస్తోన్న సమయంలో లాక్కెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పాడు. అనంతరం ఆమెపై దాడి చేశారని, తమ పేర్లు చెప్పకుండా నాలుకను కోసేశారని తెలిపాడు. తమ గ్రామానికి చెందిన యువకులే ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు