అఖిలేష్ యాదవ్ సైతం సైకిల్ గుర్తుతో పాటు పార్టీ కూడా తనదేనంటూ ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన ఎన్నికల సంఘం... పార్టీతో పాటు సైకిల్ గుర్తు కూడా అఖిలేష్ యాదవ్ దేనని స్పష్టం చేసింది. దీనితో అఖిలేష్ వర్గం సంబరాలు చేసుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీకి అఖిలేష్ యాదవ్ అధ్యక్షుడని కూడా ఎన్నికల సంఘం వివరించింది. దీనితో ములాయం సింగ్ యాదవ్ తన కన్న కొడుకు చేతిలోనే న్యాయపరంగా ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోయాడు. మరి దీనిని వెన్నుపోటు అనాలో తండ్రికి కొడుకు పోటు అనాలో...?