రాజకీయాల్లో పక్కనే ఉంటూనే వెన్నుపోటు పొడిచి అవతల పార్టీకి వెళ్లిపోవడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇక అధికారం కోసం రాజుల కాలంలో తండ్రిని, సోదరులను బంధించడం, హత్యలు చేయడం చాలానే చూశాం. ఇంతకీ విషయం ఏంటయా అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీలో రోజుకో మలుపు తిరుగుతోంది రాజకీయం. నాన్న ములాయం కొడుకుని పార్టీ నుంచి బహిష్కరిస్తారు వెంటనే ఉపసంహరించుకుంటారు. కొడుకేమో తండ్రి పార్టీని కబ్జా చేస్తారు మళ్లీ ఇంటికెళ్లి మాట్లాడుతారు.
ఢిల్లీలో ఈ సమావేశం ముగియగానే ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ మంత్రి ఏర్పాటు చేసిన విమానంలో బయలుదేరి లక్నో వెళ్లిపోయారు. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడుతూ... నేతాజీ(నాన్న)తో చర్చించాను. ఆయనే పార్టీ అధ్యక్షుడు. కానీ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక మొత్తం నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారు. ఆయనను జాతీయ రాజకీయాలకు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ ప్రకటించారు. మరి, ఈ ప్రకటన తర్వాత ఇంకా ఏమైనా ట్విస్టులు వస్తాయోమో చూడాలి.