తన కోరిక తీర్చలేదని రెచ్చిపోయిన భార్య అతడి ముక్కుపై ముష్టిఘాతాలు కురిపించింది. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జాతీయలో వచ్చిన మీడియా కథనాల ప్రకారం.. నిఖిల్ ఖన్నా (35) అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం రేణుక అనే యువతితో వివాహమైంది. పైగా, వీరిద్దరిది ప్రేమ వివాహం. నిఖిల్ నిర్మాణం రంగంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను దుబాయ్‌లో నిర్వహించాలన భర్తను భార్య రేణుక కోరింది. దీనికి భర్త నిరాకరించాడు.
పైగా, తన పెళ్లి రోజున కూడా భర్త ఖరీదైన బహుమతులు కూడా ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఈ క్రమంలో వారిద్దరి శుక్రవారం తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంత సహనం కోల్పోయిన రేణుక.. భర్త ముక్కుపై ముష్టిఘాతాలు కురిపించింది. ఆ దెబ్బలకు నిఖిల్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు దంతాలు కూడా ఊడిపోయాయి. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... రేణుకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.