వందే భారత్ స్లీపర్ క్లాస్ బోగీలు ఎలా ఉన్నాయో చూశారా?

బుధవారం, 4 అక్టోబరు 2023 (09:18 IST)
దేశ వ్యాప్తంగా పరుగులు తీస్తున్న సెమీ స్పీడ్ వందే భారత్ రైళ్లలో త్వరలోనే స్లీపర్ క్లాస్ రైళ్లు కూడా పట్టాలెక్కనున్నాయి. ఈ స్లీపర్ కోచ్ ఫోటోలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అద్భుతమైన ఇంజనీరింగ్‌తో ఎంతో ఆకర్షణీయంగా చూడముచ్చటగా ఉన్నాయి. పైగా, ఈ బోగీల లోపలిభాగం ఎంతో విశాలంగా, లగ్జరీగా ఉన్నాయి. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పగటి పూట మాత్రమే వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే రాత్రిపూట నడిపేలా స్లీపర్ క్లాస్ రైళ్లను కూడా ప్రవేశపెడతామని ఇటీవల రైల్వే శాఖ ప్రకటించింది. ఈ యేడాది డిసెంబరు నాటికి స్లీపర్ ఎడిషన్ వందే భారత్ ప్రోటోటైప్ సిద్ధం చేస్తున్నారు. మార్చి 2024 నాటికి ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి తెలిపారు.
 
తాజాగా ఆయన ఈ స్లీపర్ రైలుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అద్భుతంగా ఉన్న ఈ కోచ్‌ ఫోటోలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. విశాలంగా లగ్జరీగా ఉన్న ఈ కేసులో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇంటీరియల్ మరింత ఆకర్షణీయంగా ఉంది. రాత్రిపూట ప్రయాణించేవారికి అత్యంత సౌకర్యంగా ఉండేలా బెర్త్‌‌లను తీర్చిదిద్దారు. ఒక స్లీపర్ కోచ్ వందే భారత్ రైలులో మొత్తం 857 బెర్తులు ఉంటాయి. వీటిలో ప్రయాణికుల కోసం 823, సిబ్బంది కోసం 34 పడకలను అందుబాటులో ఉంటాయి. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైలు బోగీలను సిద్ధం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు