కాశ్మీర్‌ను కోల్పోవాల్సి వస్తుందన్న చిదంబరం... ఇక పాక్ రెచ్చిపోతుందని మండిపడ్డ వెంకయ్య

ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (08:58 IST)
భవిష్యత్‌లో కాశ్మీర్‌ను పాకిస్థాన్ కోల్పోవాల్సి వస్తుందని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. అసలు కాశ్మీర్‌పై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇటీవల చిదంబరం మాట్లాడుతూ కాశ్మీర్‌ను వదులుకుంటే, ఉత్తరాన పరిస్థితులు చక్కబడి, ఉగ్రవాద దాడులు తగ్గుతాయన్న కోణంలో చిద్దూ వ్యాఖ్యానించారు. వీటిపై వెంకయ్య స్పందిస్తూ.. చిదంబరం చేసిన వ్యాఖ్యలతో పాకిస్థాన్ రెచ్చిపోతుందన్నారు. 
 
ముఖ్యంగా చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇవి పాకిస్థాన్‌కు సంతోషాన్ని కలిగించేలా ఉన్నాయని, ఇకపై పాక్ మరింత ఉత్సాహంగా భారత్‌పై విషం చిమ్ముతుందన్నారు. భారత మాజీమంత్రి ఒకరు తమకు అనుకూలంగా ఉన్నారంటూ ఇక అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ గర్జిస్తందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి