ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన తాత్కాలిక చర్య : వెంకయ్య నాయుడు

శనివారం, 23 ఏప్రియల్ 2016 (11:34 IST)
ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను విధించడం తాత్కాలిక చర్య అని, గవర్నర్‌ నివేదిక అందిన తర్వాత అసెంబ్లీ పునరుద్ధరణకు అవకాశం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌ పరిణామాలపై ఆయన స్పందిస్తూ... రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే రాష్ట్రపతి పాలనను విధించామన్నారు. 
 
తమకు రాజ్యాంగంపైన.. చట్టంపైన నమ్మకుందని, ఉత్తరాఖండ్‌లో పరిస్థితుల కారణంగా మరో ప్రత్యామ్నాయం లేక అక్కడ తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించామే తప్ప, అసెంబ్లీని రద్దు చేయలేదన్న ఉద్దేశం తమకు లేదని ఆయన చెప్పారు. 'సొంత పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, విశ్వాస పరీక్షలో ఎలా విజయం సాధించగలరు' అని ఆయన రావత్‌ని ప్రశ్నించారు. 
 
ఇదిలాఉండగా అవినీతి ఆరోపణల ఊబిలో చిక్కుకున్న రావతను హైకోర్టు తీర్పు బయటపడేయలేదని ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌ భట్‌ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు ప్రతి బయటకు రాకముందే రావత సీఎం హోదాలో కేబినెట్‌ భేటీని ఎలా నిర్వహస్తారని భట్‌ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి