ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైనాయి. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఈ పోలింగ్‌లో పాల్గొననున్నారు. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని 63వ నెంబర్ గదిలో పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరరకు పోలింగ్ కొనసాగనుంది.
పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు 999 మంది ఎంపీలకు గాను 788 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
Vice-Presidential Poll
ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్ధిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా మార్గరెట్ అల్వా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.