కర్నాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు కొత్త మలుపు తిరిగింది. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటూ వచ్చిన బాధితురాలు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరైంది. ఆ సమయంలో ఆమె అసలు విషయాన్ని బహిర్గతం చేసింది. తనను రమేష్ రెండు మాడు సార్లు శారీరకంగా వాడుకున్నాడని బాంబు పేల్చింది. అయితే, ఎప్పటికైనా సాక్ష్యంగా ఉంటుందని భావించి తానే వీడియో తీసి స్నేహితులకు ఇచ్చినట్టు చెప్పుకొచ్చింది.
కొంతకాలం క్రితం ఓ పని నిమిత్తం తాను విధానసభకు వెళ్లిన సమయంలో మంత్రి రమేశ్ జార్కిహోళితో పరిచయం ఏర్పడిందన్నారు. ఆ సమయంలో ఆయన తన మొబైల్ నంబర్‌ను ఇవ్వగా, దాన్ని 'మల్లేశ్వరి పీజీ' అని తన మొబైల్‌లో సేవ్ చేసుకున్నానని తెలిపింది.
ఈ క్రమంలో ఎప్పటికైనా సాక్ష్యాలుగా పనికి వస్తాయన్న కోణంలో ఆలోచించి, తానే ఈ వీడియోలను తీశానని చెప్పారు. ఈ విషయాన్ని కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని, అయితే, క్లాస్‌మేట్ శ్రవణ్ అనే వ్యక్తికి, నరేశ్ అనే మరో స్నేహితుడికి ఇచ్చానని, ఇంకో కాపీని దాచుకున్నానని ఆమె పేర్కొంది.
కాగా, ఈ కేసులో కోర్టు అనుమతితో బాధితురాలిని భారీ బందోబస్తు మధ్య బౌరిగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి, కరోనా పరీక్షలు చేయించి, నెగటివ్ వచ్చిందని తేల్చుకుని, ఆపై సిట్ ఆఫీసులో అధికారులు విచారించారు. త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నారు.