ఆ తర్వాత.. రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున డప్పులకు తగ్గట్టుగా హుషారుగా స్టెప్పులేశారు. ఈ క్రమంలో.. కర్రలతో ఒకరిపై ,మరోకరు దాడి చేసుకుంటున్నారు. దీంట్లో పాల్గోన్న వారు.. 30 నుంచి 40 ఏళ్ల వయసు వారున్నారు.
ఈ వేడుకలో కొందరు పాల్గొంటే.. మరి కొందరు పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. అయితే , ఈ లాత్‌మార్ దీపావళి మేము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్ గ్రామస్తులు తెలిపారు. ఇది.. బుందేల్ ఖండ్ నుంచి వచ్చిందని తెలిపారు. అయితే, ఈ వీడియోలో గ్రామస్తులు .. కొవిడ్ నిబంధనలు పాటించడంలేదు.