ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే... భారీ మూల్యం చెల్లించక తప్పదు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అములులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. ఈ కొత్త నిబంధనలను సెప్టెంబర్ 1, 2019 నుంచి అమలులోకి తీసుకువస్తుంది.
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి భారీ పెనాల్టీ , జరిమానా విధించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా చట్టాన్ని సవరించినట్లు తెలుస్తోంది. ఈ సవరించిన చట్టం ప్రకారం... అత్యవసర వాహనాలు( అంబులెన్స్ లాంటివి) లకు మార్గం ఇవ్వకుండా రోడ్డుకి అడ్డంగా వాహనాలను ఆపితే.. వారికి రూ.10వేల జరిమానా విధించే అవకాశం ఉంది.
డ్రైవింగ్ లైసెన్సింగ్ షరతులను ఉల్లంఘించినందుకు రైడ్-హెయిలింగ్ అగ్రిగేటర్లకు రూ .1 లక్ష వరకు, వాహనాలను ఓవర్‌లోడ్ చేసినందుకు రూ .20,000 వరకు జరిమానా విధించవచ్చు. ర్యాష్ డ్రైవింగ్ కి రూ.వెయ్యి నుంచి రూ.5వేలకు వరకు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇక మద్యం సేవించి పట్టుపడితే మాత్రం రూ.పది వేల వరకు చెల్లించాలి.