కాగా, శశికళ భర్త వి.నటరాజన్ గత కొంతకాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతూ... ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు శశికళ పెరోల్ కోరారని ఆమె బంధువు, అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ తెలిపారు. ఒకవేళ ఆమె పెరోల్ పై వస్తే తమిళనాడు రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.
సోమవారం సీఎం పళని స్వామి తమ అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తుండగా, దినకరన్ తన మద్దతుదారులతో కలిసి ఆ కరపత్రాలను పంచారు. ఈ కేసులో ఆయనతో పాటు మరో 15 మంది అతడి అనుచరులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇప్పటికే దేశ ద్రోహం కేసులో మాజీ ఎమ్మెల్యే వెంకటాచలాన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే.