ఆధార్ కార్డు తరహాలోనే ఓటర్ ఐడీలు.. డిజిటల్ రూపంలో..?

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (12:07 IST)
దేశంలో డిజిటైజేషన్ అన్నీ రంగాల్లో సాధ్యమవుతోంది. తాజాగా ఓటర్ గుర్తింపు కార్డులు కూడా డిజిటైజేషన్ బాట పట్టబోతున్నాయి. 2021 ఏప్రిల్, మే నెలల్లో అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో  ఆధార్ కార్డు తరహాలోనే ఓటర్ ఐడీ కార్డులను కూడా డిజిటల్ రూపంలో అందజేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
 
అలాగే వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల జరగబోతున్న సమయంలో, అంతకుముందే ఈ ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఎన్నికల కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓటరు గుర్తింపు కార్డులను డిజిటైజేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రయత్నిస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే, ఓటర్లు తమ ఐడీ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. కొత్తగా నమోదయ్యే ఓటర్ల ఐడీ కార్డులు ఆటోమేటిక్‌గానే జనరేట్ అవుతాయి. ప్రస్తుత ఓటర్లు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా కొన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత, గుర్తింపు కార్డులు జనరేట్ అవుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు