మనం కొత్త వస్తువును కొంటే ఏం చేస్తాం. అది బాగా పనిచేస్తుందా లేదా అని చూస్తాం. ఇక ఐ-ఫోన్ వంటి ఆధునిక ఫోన్లనయితే వాటి ఫీచర్లన్నీ సరిగా పనిచేస్తున్నాయో లేదోనని క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం. కొందరైతే ఓ అడుగు ముందుకు వేసి ఆ ఫోనును నీటిలో వేసి, ఇంకా అనుమానంగా ఉంటే డాబా పైకి ఎక్కి అక్కడ నుంచి కిందికి పడవేసి దాన్ని ఎగ్జామ్ చేసేస్తారు.