విమానంలో అలా జరిగింది.. వీడియో వైరల్

సోమవారం, 23 జనవరి 2023 (22:24 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విమానంలోనూ ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు స్పైస్‌జెట్ విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడు మహిళా ఫ్లైట్ అటెండెంట్‌తో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ప్రయాణికుడికి, ఉద్యోగికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
 
మహిళా ఉద్యోగి వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించగా, వారు వచ్చి మహిళా ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని, అతనితో పాటు ఉన్న మరో ప్రయాణికుడిని కిందకు దించి విచారణ చేపట్టారు.
 
మహిళా సిబ్బందిని సదరు ప్రయాణికుడు అనుచితంగా తాకాడని సిబ్బంది ఆరోపించారు. అయితే విమానంలోని పరిమిత ప్రాంతం కారణంగానే ఈ ఘటన జరిగిందని తోటి ప్రయాణికులు తెలిపారు. తర్వాత ప్రయాణికుడు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు.
 
మరిన్ని ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అతడిని విమానంలో ప్రయాణించేందుకు కూడా అనుమతించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు