ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రాత్రి వచ్చి కిటికీలో నుంచి యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బధిర యువతిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ యువతి మరణించింది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారినికి పాల్పడిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టివుంటాడని పోలీసులు భావిస్తున్నారు.