ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, మహిళలకు రక్షణ, ఉపాధి, మౌలిక సదుపాయాల రూపకల్పనలో తమిళనాడు రాజధాని చెన్నపురి అగ్రస్థానంలో నిలిచిందన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు ఉన్నంత మాత్రాన సరిపోదని, దానికి అనుబంధంగా రవాణా, రక్షణ, సౌకర్యాలు, సామాజిక అంశాలు కూడా ప్రభావం చూపుతాయని పెర్కొన్నారు.
దేశంలో "టాప్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా" అనే అంశంపై గురువారం ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని పలు కీలక అంశాలను వెల్లడించారు. పది లక్షల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీ-1 నగరాల్లో మహిళలకు అనుమైన నగరంగా చెన్నై దేశంలోనే అగ్రస్థానంలో ఉందని నిలిచిందన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పూణె, బెంగుళూరు, హైదరాబాద్, కోల్‌కతా, కోయంబత్తూరు, మదురై నగరాలు ఉన్నాయని తెలిపారు. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీకి 14వ స్థానం దక్కడం గమనార్హం.