ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఒక వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే ఓ జంట మాత్రం లాక్డౌన్ రూల్స్ పాటించకుండా చక్కర్లు కొడుతూ, మాస్క్ లేదని అడిగిన పోలీసులకు వింతగా సమాధానమిచ్చారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నాకు మాస్క్ లేదు.. అయితే నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించింది. అనంతరం ఆమె భర్త కూడా నా కారు ఎందుకు ఆపావు అంటూ పోలీసులను నిలదీశారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా. విధుల్లో పోలీసులతో దురుసుగా మాట్లాడినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, కారు ఆపినందుకు ఆ జంట చేసిన హల్‌చల్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.